చరణ్ లుంగీ డాన్స్.. చూసి తీరాల్సిందే..
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’.
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. పూజా హెగ్డే కథానాయిక కాగా.. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రంలో విక్టరీ వెంకటేష్ , భూమిక కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో నెట్టింట వైరల్‌గా మారిన ‘బతుకమ్మ’ సాంగ్ ఒకటి కాగా తాజాగా ‘ఏంటమ్మా’ అంటూ సాగే మరో సింగిల్ విడుదల చేశారు మేకర్స్.
ఇందులో వెంకటేష్, సల్మాన్ ఖాన్ లుంగీ డాన్స్ చేస్తుండగా.. వీరితో జాయిన్ అయి సర్‌ప్రైజ్ ఇచ్చాడు రామ్ చరణ్. ‘గాడ్‌ఫాదర్’లో సల్లూ భాయ్ చిరుతో కలిసి స్ర్రీన్ షేర్ చేసుకోగా.. ఆ సినిమాకు నార్త్‌లో కలిసొచ్చింది. దీంతో ఇప్పుడు సల్మాన్‌కు చెర్రీ ఈ హెల్ప్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. గ్లోబల్ లెవల్ క్రేజ్ ఉన్న చరణ్ ఈ సాంగ్‌లో లెగ్ షేక్ చేయడం ఎంతో కొంత ప్లస్ అయ్యే అవకాశముంది. ఇక ఈ సాంగ్ తెలుగు, హిందీ, తమిళ్ లిరిక్స్‌తో సాగుతూ నార్త్ అండ్ సౌత్ కల్చర్‌తో నిండిపోయింది.