శరవేగంగా సాగుతున్న పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్.. హైప్ పెంచిన కొత్త పోస్టర్

ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుని రాజకీయాలతో బిజీగా ఉన్నారు.

Update: 2024-09-30 07:12 GMT

దిశ, సినిమా: ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుని రాజకీయాలతో బిజీగా ఉన్నారు. దీంతో గతంలో ఒప్పుకున్న సినిమాలకు టైం ఇవ్వలేక పోతున్నారు. ఈ క్రమంలోనే 'ఓజీ' షూటింగ్ కూడా పెండింగ్ పడిన విషయం తెలిసిందే. డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ సుధాకర్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కతోన్న ఈ చిత్రం నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

అయితే.. ‘ఓజీ’ నుంచి అప్‌డేట్స్ రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ కల్యాన్ ఇప్పుడు ‘హరహర వీరమల్లు’ సినిమాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌కు పాల్గోనున్నట్లు కూడా ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకాలా మరో సూపర్ అప్‌డేట్ వచ్చింది. పవన్ కల్యాణ్ ‘ఓజీ’ కి సంబంధించి ఓ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ‘హరిహరి వీరమల్లు’తో పాటు వపన్ కల్యాణ్ ‘ఓజీ’ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుందని తెలుసుకున్న ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు.

 


Similar News