హీరోయిన్‌ స్నేహకు నెటిజన్లు వార్నింగ్.. ఎందుకంటే..?

ఇండస్ట్రీలో స్కిన్ షో చేయకుండా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు చాలా తక్కువ మంది ఉంటారు.

Update: 2023-08-11 06:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో స్కిన్ షో చేయకుండా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో నేచురల్ బ్యూటీ స్నేహ ఒకరు. ‘ప్రియమైన నీకు’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. స్క్రీన్‌పై ఎటువంటి స్కిన్ షో చేయనప్పటికి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అప్పట్లో వరుస ఆఫర్లు అమ్మడు చెంత చేరేవి. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్నేహ.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది.

హద్దులు దాటకుండా.. ఫొటో షూట్‌లు చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. అంతే కాకుండా జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న ఫొటోలు సైతం నెట్టింట పోస్ట్ చేస్తుంది ఈ అమ్మడు. అవి కాస్తా వైరల్ కావడంతో.. ‘అంత బరువులు ఎత్తడం మంచిది కాదు. చాలా మంది హార్ట్ ఎటాక్‌కు గురవుతున్నారు జాగ్రత్తగా ఉండండి.. వర్కౌట్స్ కంటే యోగా మంచిది’ అంటూ తన అభిమాన నటికి స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.


Full View

Read More:  సౌందర్య ముఖంపై కాలు పెడితే.. జనాలు కొడుతారేమో అని చాలా భయపడ్డా: స్టార్ హీరోయిన్

Tags:    

Similar News