నాడు గెస్టుగా, నేడు భర్తగా.. మంచు మనోజ్ పెళ్లిపై ఎన్ని ముచ్చట్లో!

ఎట్టకేలకు భూమా మౌనిక, మంచు మనోజ్ ఒకటయ్యారు. పెళ్లితో వీరి ప్రేమకు పులిస్టాప్ పెట్టారు. ఇక వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. చాలా కాలం నుంచే మంచు కుటుంబానికి,

Update: 2023-03-04 06:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఎట్టకేలకు భూమా మౌనిక, మంచు మనోజ్ ఒకటయ్యారు. పెళ్లితో వీరి ప్రేమకు పులిస్టాప్ పెట్టారు. ఇక వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. చాలా కాలం నుంచే మంచు కుటుంబానికి, భూమా మౌనిక ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈక్రమంలోనే వీరిద్దరూ కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు. చివరికి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ మూడు మూళ్లతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో వీరికి సంబంధించిన కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వీరి మొదటి పెళ్లికి సంబంధించిన ఇష్యూ నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: మోహన్ బాబు, మనోజ్ పెళ్లికి అటెండ్ అవ్వడానికి కారణం ఆమెనా?

అయితే గతంలో మంచు మనోజ్, ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకొని కొన్ని కారణాల వలన విడాకులు తీసుకున్నారు. అలాగే మౌనికరెడ్డి కూడా బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకొని మనస్పర్దల కారణంగా విడిపోయింది. అయితే మంచు మనోజ్ భూమ మౌనిక మొదటి పెళ్లిలో అతిథిగా హాజరయ్యాడు. ఇప్పుడు ఆయనే మౌనికకు భర్తగా మారిపోయాడు. కాగా, వీటిపై పలువు పలువిధాలుగా స్పందిస్తున్నారు. ఇదో సినిమాలానే అయిపోయింది, సినిమా స్టోరీలానే వీరి పెళ్లి జరిగింది అంటూ ముచ్చటిస్తున్నారు.

Also Read: మోహన్ బాబు చేతుల మీదిగా మనోజ్, మౌనికల పెళ్లి.. వైరల్ అవుతోన్న ఫొటోస్..

Tags:    

Similar News