సాయి పల్లవి పెళ్లి చేసుకోదా.. అందుకే చెల్లెలు ఈ నిర్ణయం తీసుకుందా?

నాచురల్ బ్యూటీ సాయిపల్లవి చెల్లెలు.. పూజా కన్నన్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది

Update: 2024-01-16 05:05 GMT

దిశ, సినిమా: నాచురల్ బ్యూటీ సాయిపల్లవి చెల్లెలు.. పూజా కన్నన్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం నెట్టింట ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో సాయిపల్లవి పై పలువురు జనాలు కామెంట్లు విసురుతున్నారు. అక్క పెళ్లి చేసుకోకముందే చెల్లి ఏడడుగులు వేస్తుంది.. అయినా సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్. వారికి పెళ్లి కాదు.. ప్యూచర్ ఇంపార్టెంట్. సాయిపల్లవి పెళ్లి చేసుకుంటుందో లేదోనని చెల్లెలు పూజా కన్నన్ త్వరగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుంది అంటూ కొంతమంది కామెంట్లు చేయగా.. మరికొంతమంది సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు పలు చిత్రాలతో ఆమె బిజీగా ఉంది అంటూ నాచురల్ బ్యూటీని వెనకేసుకొస్తున్నారు ఫ్యాన్స్. ఇక చెల్లెలి పెళ్లి కారణంగా సాయిపల్లవికి ఈ బాధలు తప్పేలా లేవంటున్నారు నెటిజన్లు.


Similar News