మెగా ఫ్యామిలీలో ఉపాసనకు కూడా దక్కని గౌరవం లావణ్యకు దక్కుతుంది.. ఏ విషయంలో తెలుసా?
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది లొట్ట చెంపల బ్యూటీ లావణ్య త్రిపాఠి.
దిశ, సినిమా: అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది లొట్ట చెంపల బ్యూటీ లావణ్య త్రిపాఠి. తర్వాత ‘భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా, మిస్టర్, ఉన్నది ఒక్కటే జిందగి, రాధ, ఎ1 ఎక్స్‌ప్రెస్, శ్రీరస్తు శుభమస్తు, అంతరిక్షం’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది.
ఆ తర్వాత మెగా మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో హీరో వరుణ్ తేజ్ ను తన యాటీట్యూడ్తో పడేసింది. నటన పరంగా సత్తాచాటిన ఈ ముద్దగుమ్మ ప్రస్తుతం మెగా కోడలు అయ్యింది. వివాహనంతరం ఈ అమ్మడు ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఫిబ్రవరి 2 వ తేదీ నుంచి ఈ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్కు అవుతుంది.
ఫ్యామిలీ విషయానికొస్తే.. మెగా కోడలిగా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఫ్యామిలీ మెంబర్స్‌తో కలసిమెలసి మర్యాదపూర్వకంగా మెలుగుతుంది. సినిమాల విషయంలో మెగా ఫ్యామిలీ కి మచ్చ పడకుండా ఆచి తూచి అడుగేస్తుంది. అయితే మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టార ఉపాసనకు దక్కని ఓ అదృష్టం లావణ్య త్రిపాఠికి దక్కుతుందని నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అపోలో హాస్పిటల్ చైర్మన్ మనువరాలైన ఉపాసన రామ్ చరణ్ ను ప్రేమ పెళ్లి చేసుకొన్న విషయం తెలిసిందే.
తన మంచి తనంతో, సేవా గుణంతో హీరోయిన్ లెవల్లో మెగా ఫ్యాన్స్‌కు బాగా దగ్గరైంది. అయితే ఇప్పుడు మెగా అభిమానులు ఉపాసన కంటే లావణ్యకు బాగా దగ్గరైనట్లు తెలుస్తోంది. పెద్ద కోడలిగా ఉపాసనకు ఉన్న క్రేజ్‌ను మించి లావణ్య క్రేజ్‌ను సాధించిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.