బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకున్న ‘శాకుంతలం’.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’.
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక కథాంశంతో తెరక్కెకిన ఈ మూవీ ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైంది. కథలో బలమైన ఎమోషన్స్ లేకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ కనించకపొవడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ రూ. 20 కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.
ఇకపోతే తాజాగా ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నట్లు నిర్మాణ సంస్థ గుణ, టీమ్ వర్క్స్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023లో ‘బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్‌గా’.. ‘బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్’గా ఈ మూవీ అవార్డులను గెలుచుకున్నదని ఈ పోస్టర్‌లో ప్రకటించగా దీనిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.. ‘డిజాస్టర్ సినిమాలకు కూడా అవార్డులు ఇస్తారా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇన్ని అవార్డులు గెలుచుకోవడానికి ఈ సినిమాలో ఏముంది?’ అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.
Epic Love Tale #Shaakuntalam honored with prestigious Global Awards ✨
— Telugu FilmNagar (@telugufilmnagar) May 11, 2023
Congratulations to the whole team!! ♥️♥️
Streaming now on @PrimeVideoIN. https://t.co/fZh7PrPyjs#ShaakuntalamonPrime@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @SVC_official… pic.twitter.com/yRNSooFpL0
Also Read.