Nepotism: దళపతి విజయ్ కొడుకుపై ట్రోలింగ్.. నెపోటిజం ఎక్కువైపోతుందంటూ..
ఇండస్ట్రీ ఏదైనప్పటికి నెపోటిజం అనేది కామన్ అయిపోయింది.
దిశ, సినిమా: ఇండస్ట్రీ ఏదైనప్పటికి నెపోటిజం అనేది కామన్ అయిపోయింది. టాప్ హీరోలు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్‌లు ఇలా అందరూ వారి వారసులను ఇండస్ట్రీలోకి దించుతున్నారు. దీనిపై ఇప్పటికే చాలా రకరకాల గొడవలు జరుగుతున్నప్పటికీ ఎవరు ఆగకుండా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. కానీ ఎంత వారసత్వంగా వచ్చిన కూడా హిట్ కొట్టాలంటే టాలెంట్ మాత్రం ఉండాలి. అది లేకుంటే ఎంత పెద్ద హీరో కొడుకైనా జీరోనే.
అయితే కోలీవుడ్ అగ్ర హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. జాసన్ సంజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఓ భారీ బడ్జెట్ మూవీని తాజాగా అనౌన్స్‌చేసింది. దీంతో ‘కోలీవుడ్ నెపోటిజం ఎక్కువైపోతుందని, తమ వారసులు, బంధువులను ఎంకరేజ్ చేసే ధోరణి పెరిగిపోతుంది’ అని నెటిజన్లు ట్రోల్స్ మొదలుపెట్టారు. విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్, ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్, శంకర్ కూతురు అదితి శంకర్‌తోపాటు మరికొంతమంది వారసులు కూడా రీసెంట్‌గానే కెరీర్‌ను మొదలుపెట్టారు. దీంతో నెపోటిజం బ్యాచ్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ‘వీరందరిని కలిపి కోలివుడ్ నెపోటిజం అనే సినిమా తీస్తే బాగుంటుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రజంట్ ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
Read More: కాబోయే భార్యకు ఇలాంటి లక్షణాలుండాలి: Sudigali Sudheer