‘ఈగల్’ను ఓటీటీలో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు.. థియేటర్‌కి డిజిటల్‌కి మార్పు ఏంటంటే..?

మాస్ మహారాజా తాజా సినిమా ‘ఈగల్’.

Update: 2024-03-04 11:02 GMT

దిశ, సినిమా: మాస్ మహారాజా తాజా సినిమా ‘ఈగల్’. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో.. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, కావ్య థాపర్ కీలక పాత్రల్లో నటించారు. అక్రమ ఆయుధాల కట్టడికి హీరో చేసే పోరాటమే సినిమా కథ. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి-9 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసింది. ఇందులో ఎన్నడూ లేని విధంగా డిఫరెంట్ లుక్ కనిపించి ఆకట్టుకున్నాడు రవితేజ.

‘ఈగల్’ కు పోటీగా మరి ఏ ఇతర సినిమాలు లేకపోవడం ఈ చిత్రానికి ప్లెస్ పాయింట్ అయింది. దీంతో టాక్ విషయం పక్కన పెడితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం బాగానే వసూలు చేసినట్లు ప్రకటించారు మేకర్స్. అయితే.. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ తర్వాత ‘ఈగల్ పార్ట్ 2’ గురించి కూడా అప్ డేట్ ఇచ్చారు. ‘ఈగల్-2 యుద్ధకాండ’ అనే టైటిల్‌తో సినిమా ముగించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తుంది. ఇక థియేటర్‌లోకి ఓటీటీకి ఓ తేడా కనిపెట్టారు మూవీ చూసినవాళ్లు. థియేటర్‌లో క్లైమాక్స్ అప్పుడు ‘ఈగల్-2 యుద్ధకాండ’ అని ముగించగా.. ఓటీటీలో మాత్రం పార్ట్ 2 ఉన్నట్లు జస్ట్ హింట్ ఇచ్చారు అంతే. యుద్ధకాండ అనేది తీసేశారు. దీంతో ‘ఈగల్ పార్ట్ 2’ పై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Read More..

ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఆహా’ ఈజ్ బ్యాక్.. పోస్ట్ వైరల్  

Tags:    

Similar News