కులాంతర, మతాంతర వివాహాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నజ్రియా..
దిశ, వెబ్‌డెస్క్: నాని హీరోగా, నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘అంటే సుందరానికి’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మరో రెండు రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ ఉండటంతో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉంది..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: నాని హీరోగా, నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించిన సినిమా 'అంటే సుందరానికి'. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మరో రెండు రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ ఉండటంతో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నాని, నజ్రియా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
తాజాగా నజ్రియా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కులాంతర, మతాంతర వివాహాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నజ్రియా మాట్లాడుతూ.. "వివాహ బంధం విషయంలో కులమతాల పట్టింపులు ఉండకూడదు. నేను అయితే అదే నమ్ముతాను. ఇటీవల కొద్ది కొద్దిగా పరిస్థితులు మారుతున్నాయి. మీ సొంత కులం లేదా మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారన్న గ్యారెంటీ లేదు. ఏ బంధమైనా ప్రేమతోనే ముడిపడి ఉంటుంది. అన్నిటికంటే ప్రేమే గొప్పది. మన పిల్లల తరానికైనా వివాహ బంధంలో ఈ కుల మతాల సమస్య ఉండదని, ఉండకూడదని అనుకుంటున్నాను. కరోనా తర్వాత జీవితం చాలా చిన్నదని అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అందుకే ఈ కులాలు, మతాలు విషయాలపై మొండిగా ఉండటం అనవసరం అని అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.