సింపుల్ లుక్‌లో నజ్రియా.. కానీ వాచ్ చాలా కాస్ట్లీ గురూ.. దాని ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

‘జై బోలో తెలంగాణ’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన మలయాళీ భామ మీరా నందన్ ఇటీవలె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-07-03 02:59 GMT

దిశ, సినిమా: ‘జై బోలో తెలంగాణ’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన మలయాళీ భామ మీరా నందన్ ఇటీవలె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో ఏంతో మంది నటీ నటులు పాల్గొన్నారు. కానీ వారందరిలో హీరోయిన్ నజ్రీయ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించారు. తన భర్త ఫహాద్ ఫజీల్‌తో కలిసి అందరి దృష్టిని ఆకర్షించింది. లేత గులాబీ రంగు చీరలో సింపుల్ లుక్‌లో మరింత అందంగా కనిపించింది. అయితే ఈ వేడుకలో నజ్రియా ధరించిన వాచ్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ వాచ్ ధర తెలుసుకోవడానికి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు. ఎట్టకేలకు ఆ వాచ్ ధర డిటైల్స్ సాధించారు.

ఆమె ధరించిన వాచ్ రోలెక్స్ డేట్‌జస్ట్ 36 మోడల్. అయితో ఆ వాచ్‌లో పాలీష్ చేసిన ఓ స్టెర్‌స్టీల్ స్టెయిన్ లెస్ స్టీల్ కేస్ 18K పసుపు బంగారంలో ఉన్నాయి. అదే విధంగా వాచ్‌లో వైట్‌మదర్- ఆఫ్-పెర్ల్ డయల్ కూడా ఉంది. ఇక ఈ లగ్జరీ రోలెక్స్ వాచ్ ధర ఏకంగా రూ. 11,84,419 అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీంతో నెటిజెన్లు ఏంటీ వాచే అంత ధర ఉంటే ఇంకా మొబైల్, చీర, బ్రాస్లెట్ ధర ఇంకెంత ఉంటుందో అని కామెంట్స్ చేస్తున్నారు.


Similar News