'గాడ్ ఫాదర్' నాకు ప్రత్యేకమైన చిత్రం.. నయన్

స్టార్ హీరోయిన్ నయనతార 'గాడ్ ఫాదర్' మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ వసూళ్లు రాబడుతోంది.. Latest Telugu News

Update: 2022-10-09 06:42 GMT

దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ నయనతార 'గాడ్ ఫాదర్' మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలోనే తన అభిమానులను ఉద్దేశిస్తూ స్పెషల్ నోట్ షేర్ చేసిన నయన్.. తమ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు స్పెషల్ థాంక్స్ చెప్పింది.

'సినిమాను బ్లాక్‌బస్టర్‌ చేసిన సినీ ప్రియులకు ధన్యవాదాలు. మీరందరూ థియేటర్‌లో మీ ఆత్మీయులతో కలిసి మా చిత్రాన్ని చూడటం ఆనందంగా ఉంది. ఇది నాకు ప్రత్యేకమైన చిత్రం. ఎందుకంటే ఈ సినిమాలోని నటీనటులు, యూనిట్ సభ్యులది ఓ అద్భుతమైన బృందం. మెగాస్టార్‌తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం చెప్పుకోదగిన విశేషం. నాపై నమ్మకముంచి మూడోసారి నాకు సహకరించినందుకు దర్శకుడు మోహన్ రాజాకు నా కృతజ్ఞతలు. సల్మాన్ సర్ అద్భుతమైన నటనతో చిత్రాన్ని హిట్ చేసినందుకు ధన్యవాదాలు. నా నటనను తీర్చిదిద్ది, నన్ను మంచి నటిగా మార్చే నా సహనటులు, చిత్ర బృందం, నిర్మాతలు, టెక్నిషియన్లు టీమ్ మొత్తానికి, వాళ్ల కృషికి హృదయపూర్వక అభినందనలు' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 

ALSO READ థియేటర్‌లో రచ్చ చేసిన చిరు ఫ్యాన్స్.. బాణసంచా కాల్చుతూ


Similar News