50 సెకన్లకు రూ. 5 కోట్లు! ఈ స్టార్ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా!
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతారా.. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుస సినిమాలు చేస్తోంది.
దిశ, సినిమా: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతారా.. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుస సినిమాలు చేస్తోంది. అంతే కాకుండా ఇటీవల ‘జవాన్’ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ బ్యూటీ రెమ్యునరేషన్ కూడా పెంచి రూ. 10 కోట్ల మేర తీసుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లైన సరే తగ్గని క్రేజ్‌తో దూసుకుపోతున్న నయన్.. సినిమాలతో పాటు పలు యాడ్స్ కూడా చేస్తూ సందడి చేస్తుంది. ఇక యాడ్స్‌లో రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. ఈ బ్యూటీకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్, సోషల్ మీడియా క్రేజ్ ఆధారంగా కేవలం 50 సెకన్ల యాడ్‌లో నటించినందుకు ఐదు కోట్లు పారితోషికం తీసుకుంటుందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, నయన్‌కు ఉన్న క్రేజ్ చూసి ఫ్యాన్స్ మాత్రం ఫిదా అవుతున్నారు.