మరోసారి హాట్ టాపిక్‌గా మారిన నయనతార.. తన రేంజ్ కాదని తెలిసిన విఘ్నేష్‌ను మ్యారేజ్ చేసుకోవడానికి కారణమేంటి?
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి సుపరిచితమే.
దిశ, సినిమా: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి సుపరిచితమే. ఈ బ్యూటీ దర్శకుడు విఘ్నేష్ ను వివాహం చేసుకుని పండంటి కవలకు జన్మనిచ్చింది. ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తోన్న ఈ జంట విడిపోతుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో విసుగు పుట్టిన నయనతార-విఘ్నేష్ ఇద్దరు కలిసున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టి.. ఈ రూమర్స్ కు చెక్ పెట్టారు.
అయితే తాజాగా నయన్ గురించి మరో వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అంత ఫాలోయింగ్ ఉన్న నయనతార విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకోవడం ఏంటి? దీని వెనక పెద్ద ప్లానింగే ఉంది అంటూ నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు. ఎంతో మందితో లవ్ ఎఫైర్స్ నడిపింది. దానికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అందుకే వేరే ఏ పర్సన్ ను మ్యారేజ్ చేసుకున్న భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని నయన్ ఈ దర్శకుడిని పెళ్లి చేసుకుందని జనాలు చర్చించుకుంటున్నారు.
అలాగే నయన్ కంటే తక్కువ రేంజ్ పర్సన్ ను చేసుకుంటే డబ్బు కోసం ఈమె ఏం చెబితే అదే వింటాడు. పైగా విఘ్నేష్ ఇతరులను బాధపెట్టే వ్యక్తి కాదు. అందుకే నయన్ ఆయనను వలలో వేసుకుని పెళ్లి చేసుకుంది. నయనతార కన్నింగ్ ప్లాన్ మామూలుగా లేదుగా’’ అంటూ కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.