డిసెంబర్ 22న వస్తున్న ఇంటర్వెల్ లేని సినిమా.. 'కనెక్ట్'

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం 'కనెక్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన ఈ మూవీలో సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్, హనియా

Update: 2022-12-01 07:32 GMT

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం 'కనెక్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన ఈ మూవీలో సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్, హనియా నఫీస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నయనతార, విఘ్నేష్ శివన్ సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ పంచుకున్నాడు విఘ్నేష్ శివన్. 'రండి సినిమా హాళ్లలో #కనెక్ట్ అవుదాం! ప్రపంచవ్యాప్తంగా 22.12.22 నుంచి థియేటర్లలో. ఇంటర్వెల్ లేని సినిమా. ఒక ప్రయాణంలో 99 నిమిషాల పూర్తి హారర్ వినోదం' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా Certified U/A 'Connect' అనే టైటిల్‌తో పగిలిపోయిన స్క్రీన్‌లో కనిపిస్తున్న అమ్మాయి ఫొటో అట్రాక్ట్ చేస్తోంది.

READ MORE

నేను ఎప్పటికీ నీదాన్నే.. హాజెల్ కీచ్ హార్ట్‌ఫెల్ట్ నోట్ వైరల్ 

Tags:    

Similar News