గొడవలు పెట్టడానికే ఉన్నావా? యాంకర్ శ్రీముఖిపై నటరాజ్ మాస్టర్ ఫైర్
నీతోనే డాన్స్’ షో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఫినాలే దగ్గర పడటంతో జోడిలన్నీ తమ సత్తా చాటుతున్నాయి. ఇక తాజాగా ‘రేస్ టు ఫినాలే-2’ ప్రోమో రిలీజ్ కాగా అంతా గొడవలు, డ్యాన్స్
దిశ, సినిమా:‘నీతోనే డాన్స్’ షో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఫినాలే దగ్గర పడటంతో జోడిలన్నీ తమ సత్తా చాటుతున్నాయి. ఇక తాజాగా ‘రేస్ టు ఫినాలే-2’ ప్రోమో రిలీజ్ కాగా అంతా గొడవలు, డ్యాన్స్, పెర్ఫామెన్స్‌లతో జంటలన్నీ ఇచ్చిపడేశాయి. ప్రోమోలో నటరాజ్ మాస్టర్ గొడవ మాత్రం హైలెట్ అయింది. నార్మల్‌గా నటరాజ్ మాస్టార్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన అక్కడ ఎదో ఒక సంఘటన చోటుచేసుకుంటుంది. తాజాగా ఈ ప్రోమోలో కూడా అదే జరిగింది. ఏమిటంటే నటరాజ్-నీతు జోడి అద్భుతంగా పెర్ఫామెన్స్ ఇచ్చిన తర్వాత శ్రీముఖి ‘ఎలా అనిపించింది మాస్టర్ సొంత బయోపిక్ చేయడం. నాకెందుకో ఆ టార్చర్ పెట్టే అమ్మాయి మీరు కాకుండా అంజలి అయి ఉంటే బాగుండు అనిపించింది’ అని చెప్పింది. దీంతో నటరాజ్ గట్టిగా సీరియస్ అవుతూ ‘ఎంతమందికి గొడవలు పెడతావు నువ్వు. నీకు అసలు ఏం కావాలి చెప్పు. నాకు ఒక విషయం అర్థం కాలేదు. మార్కులు తక్కువ రావాలని ప్లాన్ చేస్తున్నావా’ అంటూ శ్రీముఖిపై సీరియస్ అయ్యాడు. దీంతో అక్కడ వాతావరణం మొత్తం ఒక్కసారిగా సిరీయస్ మూడ్‌లోకి మారిపోయింది.