సుఖం ఇవ్వలేదు.. అందుకే విడిపోయాం.. పవిత్రతో జీవితం ఎలా ఉందో కుండబద్దలుకొట్టిన నరేష్?
పవిత్ర లోకేష్-నరేష్ ప్రేమ వ్యవహారం ఏ రేంజ్‌తో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, సినిమా: పవిత్ర లోకేష్-నరేష్ ప్రేమ వ్యవహారం ఏ రేంజ్‌తో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వీరిదద్దరికి ఇప్పటికే పెళ్లై పిల్లలుండటంతో సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్‌కు గురయ్యారు. మరికొంతమంది వీరికి మద్ధతుగా మాట్లాడారు. పవిత్రతో రిలేషన్‌పై నరేష్ మూడో భార్య రమ్మ రఘుపతి అంగీకరించలేదు. వీరిద్దరు ఓ హోటల్ రూంలో కలిసుంటే రమ్య మీడియా వారిని తీసుకొచ్చి రచ్చ రచ్చ చేసింది.
అయితే తాజాగా నరేష్ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. పవిత్రతో రిలేషన్‌పై స్పందించాడు. ‘‘ఒకరు మంచివారు ఒకరు చెడ్డవారని చెప్పలేను. ప్రపంచంలో చాలామంది భార్య భర్తలు డివోర్స్ తీసుకుంటున్నారు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. కానీ ఏ భార్యతో సంతోషంగా లేను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. 40 ఏళ్ల తర్వాత ఓ తోడు అవసరం. ఈ ఏజ్ తో సింగిల్ గా బతకడం చాలా కష్టం. దీంతో నాలాగా ఆలోచించే కరెక్ట్ పార్న్టర్‌ను ఎంచుకున్నాను. పవిత్రతో నా లైఫ్ చాలా బాగుంది. ఇకపై ప్రశాంతంగా బతకాలని భావిస్తున్నాను. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్’’ అంటూ నరేష్ వెల్లడించారు. దీంతో నెటిజన్లు.. ముగ్గురి భార్యల దగ్గర దొరకని సుఖసంతోషాలు పవిత్ర దగ్గర దొరుకుందా? అంటూ కాంట్రావర్సీ కామెంట్స్ చేస్తున్నారు.