Pavithra Lokesh క్యారెక్టర్‌పై Naresh కొడుకు షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్, పవిత్ర లోకేష్ ప్రేమాయణం గురించి ఇండస్ట్రీలో తెలియని వారు లేరు.

Update: 2023-08-23 11:50 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్, పవిత్ర లోకేష్ ప్రేమాయణం గురించి ఇండస్ట్రీలో తెలియని వారు లేరు. వయసుతో సంబంధం లేకుండా వీళ్లిద్దరు ప్రేమలో ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఈ జోడీకి ఎలాంటి సపోర్ట్ దక్కడం లేదు. అయితే తాజాగా నరేష్, పవిత్ర ప్రేమాయణం గురించి నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మా కుటుంబంలో ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తారు. ఎవరిపైన ఆధారపడరు. మొదటి నుంచి అదే జరుగుతుంది. ఈ క్రమంలో కొన్ని తప్పులు జరిగాయి. కానీ ఎవరి గురించి నేను చెడుగా ఫీలవ్వలేదు. ప్రజలు మా కుటుంబం గురించి ఎలా మాట్లాడినా నేను పట్టించుకోను. జనాలకు నచ్చినట్టు జీవించలేం కదా. నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తాను. ఎందుకంటే నాన్న సంతోషంగా ఉన్నాడా? లేదా? అనేది మాత్రమే మాకు కావాలి. ఇక పవిత్ర లోకేష్ నాకు ఎప్పటినుంచో తెలుసు. ఆమె చాలా మంచిది. ఆమెను పవిత్ర గారు అని పిలుస్తాను’ అని తెలిపాడు. ఇక నవీన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి : గోడకు ఆ యాంగిల్లో నిలబడి Bold Photos షేర్ చేసిన టాలీవుడ్ నటి

Tags:    

Similar News