అదో జిగేల్ రాణి.. నువ్వో లత్కోర్ గాడివి.. నరేష్‌, పవిత్రను పచ్చి బూతులు తిట్టిన నెటిజన్ (వీడియో)

సినీ ఇండస్ట్రీలో నరేష్, పవిత్రల గురించి తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు.

Update: 2023-06-07 11:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో నరేష్, పవిత్రల గురించి తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే వాళ్ల విషయం గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘మళ్లీ పెళ్లి’ సినిమాతో సంచలనం సృష్టించిన ఈ జంట.. తమ జీవితాన్ని ఏకంగా రోడ్డున పెట్టేసుకున్నారని ఫిల్మ్ నగర్‌‌లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే వీరి ‘మళ్లీ పెళ్లి’ సినిమా చూసిన ఓ నెటిజన్ నరేష్, పవిత్రలను పచ్చి బూతులు తిట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

‘‘ఇన్ని సంవత్సరాలు కాపురం చేసుకున్న వారి మధ్యలోకి ఎవతో జిగేలు రాణి రావడం చాలా తప్పు. ఫిల్మ్ ఛాంబర్‌లో చాలా తప్పులు జరుగుతున్నాయని చెప్తున్నావు మరి నువ్వు ఏం చేస్తున్నావు..? సినిమాలో 100 తప్పులు చేశావు. నా పెళ్లం అట్టాంటిది.. ఇట్టాంటిది అని చెబుతున్నావు. 20 సంవత్సరాల తర్వాత తెలిసిందా నీ పెళ్లం ఇలాంటిదని. వాడు తప్పు చేయడం తప్పు కాదు. కానీ అందరికి తెలిసేలా సినిమా తీసి అది అలాంటిది, ఇలాంటిది అని భార్య గురించి మాట్లాడుకునేలా చేశాడు. వాడో లత్కోర్ గాడు’’ అంటూ పచ్చి బూతులు తిట్టాడు. అయితే.. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్స్ రివ్యూ ఇచ్చిన వ్యక్తికి సపోర్ట్‌గా మాట్లాడుతూ నరేష్‌ను తిట్టిపోస్తున్నారు.

Tags:    

Similar News