దిశ, సినిమా : నేచురల్ స్టార్ నాని తన లేటెస్ట్ రిలీజ్ 'శ్యామ్ సింగరాయ్'తో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ తర్వాత వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో 'అంటే సుందరానికి', శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'దసరా' సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే 'దసరా' చిత్రాన్ని పూర్తిగా తెలంగాణ కల్చర్‌లో తెరకెక్కి్స్తుండగా.. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక విలేజ్ సెట్ వేస్తున్నారట మేకర్స్. 12 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ సెట్ కోసం రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా.. సినిమాలోని కీలక సన్నీవేశాలన్నింటినీ ఈ సెట్‌లోనే పూర్తిచేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన నజ్రియా నజీమ్ నటిస్తోంది.