Dasara Movie: ‘దసరా’ మూవీ టికెట్ రేట్లు తగ్గించేశారు
టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఫలింతగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ క్రమంలో తాజగా సినిమా టికెట్ రేట్లను చిత్ర యూనిట్ తగ్గించింది. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధరను రూ.112 రూపాయలుగా ఫిక్స్ చేశారు. కానీ, ఈ డిస్కౌంట్ కేవలం హిందీ వెర్షన్‌కు మాత్రమేనట. ఎందుకంటే హిందీ వెర్షన్‌లో తొలిరోజు అటు ఇటుగా ఈ మూవీ రూ.40 లక్షల వసూళ్లు మాత్రమే రాబట్టింది. నాని ఎన్ని ప్రమోషన్స్ చేసినప్పటికి హిందీలో మార్కెట్ కాకపోవడంతో మూవీ టీమ్ ఈ నిర్ణయం తీసుకుందట.
ఇవి కూడా చదవండి:
మళ్లీ ‘దసరా’ లాంటి సినిమా చేయను.. నాని
మనం ఇలాంటివి ఎన్నో చేయాలి ‘దసరా’ సినిమాపై ప్రభాస్ స్పెషల్ పోస్ట్..