సాయిపల్లవి పెళ్లి ఎప్పుడో అయిపోయింది.. అందుకే చెల్లెలు పెళ్లి చేసుకుంది.. బయటపడ్డ అసలు నిజం?
రీసెంట్గా టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవి సిస్టర్ పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే.
దిశ, సినిమా: రీసెంట్గా టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవి సిస్టర్ పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే. మొన్నటిదాక ఈ అమ్మడు ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో సాయిపల్లవి పెళ్లి చేసుకోకముందే పూజా కన్నన్ వివాహం చేసుకోవడానికి కారణం ఏంటి? ఇంత త్వరగా ఎందుకు చేసుకుంటోంది? అంటూ నెట్టింట జనాలు ఆరా తీయడం స్టార్ట్ చేశారు.
అయితే గతంలో వీరి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాచురల్ స్టార్ నాని ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి పెళ్లిపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ‘‘సాయి పల్లవికి ఎప్పుడో వివాహం జరిగింది. అంతేకాదు మీరు ప్రోమో వేసుకుంటారు కాబట్టి మరింత ఫీల్‌తో చెబుతున్నాను. ఆమెకు నిజంగానే పెళ్లి అయిపోయిందండి’’. అంటూ నాని సరదాగా చెప్పుకొస్తారు.
నాని మాటలకు నవ్వుకుంటూ సాయిపల్లవి.. ఈ వీడియో మా అమ్మ చూస్తే కనుక నాని పని అయిపోతుంది. అమ్మ తప్పకుండా నానికి ఫోన్ చేస్తుంది. అంటుంది. దీనికి నాని స్పదించి.. హా చేస్తే ఏమౌతుంది. చేయమను ఆంటీతో ఫోన్ మాట్లాడుతాను అంటూ నాని సరదాగా అనడంతో అక్కడున్నవారంతా నవ్వుతారు.
ప్రస్తుతం నెటిజన్లు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయగా.. ‘నిజంగానే నేచురల్ బ్యూటీకి పెళ్లైపోయిందా నాని, మీరు చెప్పింది నిజమేనా? అంటూ కొంతమంది కామెంట్స్ చేయగా.. మరికొంతమంది అవును అందుకే సాయిపల్లవి చెల్లెలు పెళ్లి చేసుకుంది అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం నాని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.