MAHESH BABU: సూపర్ స్టార్‌కు నమ్రత మెల్టింగ్ విషెష్.. బర్త్ డే నాడు నెట్టింట వైరలవుతోన్న మహేష్ బాబు ఆస్తి వివరాలు!

ఘట్టమనేని వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

Update: 2024-08-09 06:04 GMT

దిశ, సినిమా: ఘట్టమనేని వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అగ్ర హీరో దివంగత కృష్ణ కుమారుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. 8 చిత్రాలకు పైగా బాలనటుడిగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందాడు. ఫస్ట్ ప్రిన్స్ నటించిన రాజకుమారుడు మూవీకి ఏకంగా ఉత్తమ నటుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా నిజం చిత్రానికి కూడా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకోవడం విశేషం.

తర్వాత ‘‘అర్జున్, ఒక్కడు, టక్కరి దొంగ, మురారి, పోకిరి, అతిథి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరు కారం’’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళితో ఓ భారీ ప్రాజెక్టు‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇకపోతే నేడు మహేష్ బాబు నేడు తన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ప్రిన్స్ సతీమణి నమ్రత హార్ట్ టచ్చింగ్ విషెష్ చేసింది. ‘మరొక సంవత్సరం ఎంత అమేజింగో చెప్పడానికి ఈ పుట్టినరోజు మరొక కారణం అయింది. లైఫ్ నీతో గడిపేకొద్ది ఇంకా బెటర్ అవుతుంది. మీరు అద్భుతమైన వ్యక్. మీతో నా జీవితం ఒక బ్లాక్‌బస్టర్. హ్యాపీ బర్త్ డే నా సూపర్ స్టార్, నా భాగస్వామి, నా లవ్’.

అంటూ లవ్ సింబల్స్ జోడించి నమ్రత రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ ఆస్తుల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రిన్స్‌కు విలాసవంతమైన బంగ్లాలు, లగ్జరీ కార్లు ఉన్నాయట. జూబ్లీహిల్స్ లో ఉన్న ఓ భవనం ధర ఏకంగా రూ. 30 కోట్లు ఉంటుందట. సూపర్ స్టార్ ఆస్తుల విలువ 250-330 కోట్ల వరకు ఉంటుందట. ప్రస్తుతం సూపర్ మహేష్ బాబు ఆస్తుల వివరాలు విన్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

అలాగే నేడు ప్రిన్స్ బర్త్ డే సందర్భంగా మురారి సినిమా రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఎగబడి మరీ థియేటర్ల వద్ద బారులు తీరారు. హైదరాబాదులో మల్లికార్జున థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఏకంగా మహిళలైతే అక్కడే డాన్స్ వేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News