బిగ్‌బాస్-8: ఊహించని విధంగా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్.. షాక్‌లో నెటిజన్లు

సక్సెస్ ఫుల్‌గా నాలుగు వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్- 8.. ప్రజెంట్ ఐదో వారంలో అడుగుపెట్టింది.

Update: 2024-10-05 09:24 GMT

దిశ, సినిమా: సక్సెస్ ఫుల్‌గా నాలుగు వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్- 8.. ప్రజెంట్ ఐదో వారంలో అడుగుపెట్టింది. ఎప్పటికప్పుడు భిన్నమైన టాస్క్‌లతో హౌస్ మేట్స్‌తో ఓ ఆట ఆడుకున్న బిగ్‌బాస్.. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నాడు. ఇక స్టార్టింగ్ హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా వారిలో బేబక్క, శేఖర్ బాషా, అభయ్, సోనియా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఈ వారంలో మిడ్ నైట్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో హౌస్‌లో ఎక్కువగా ఆదిత్య ఓం పేరు చెప్పడంతో ఆయనను ఎలిమినేట్ చేశారు.

ఇక సండే నాడు ఎలిమినేషన్‌లో నైనిక ఎలిమినేట్ అయ్యే బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి నైనిక టాప్ 5 కంటెస్టెంట్ లిస్ట్‌లో ఉండాలి. హౌస్‌లోకి వచ్చిన ఫస్ట్ వీక్‌లోనే నైనిక గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఇంటికి చీఫ్ అవ్వడానికి ఆమె ఆడిన గేమ్ విధానం బిగ్ బాస్ లవర్స్‌ను ఆకట్టుకుంది. దీంతో ఆమె ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందని అందరూ ఊహించారు. కానీ, గత మూడు వారాలుగా నైని గేమ్ డల్ కావడంతో.. ఊహించని రీతులో ఈ వీక్ ఎలిమినేషన్ అయ్యి నైనిక బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్త ప్రజెంట్ వైరల్ కావడంతో.. నైనిక ఎలిమినేషన్‌ను కొందరూ జీర్ణించుకోలేకపోతున్నారు.


Similar News