నాగశౌర్య ‘రంగబలి’ సినిమా రివ్యూ.. హిట్టా ఫట్టా?
యంగ్ హీరో నాగశౌర్య ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీతోనే హిట్ కొట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.
దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో నాగశౌర్య ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీతోనే హిట్ కొట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా, నాగశౌర్య, పవన్ బాసంశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘రంగబలి’. ఈ చిత్రాన్ని ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీ జూలై 7న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. రంగబలి సినిమాకు ప్రేక్షకుల్లో మిక్స్‌డ్ స్పందన లభిస్తోంది.
నాగశౌర్య గోదావరి యాసతో కూడిన కామెడీ టైమింగ్ బాగుంది. తన క్యారెక్టరైజేషన్, కామెడీ టైమింగ్‌ని ఫరెఫెక్ట్‌గా పండించాడు. సత్య కామెడీ హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో సత్య తన టైమింగ్‌తో చాలా బాగా అలరించారని నెటిజన్లు అంటున్నారు. అలాగే కథ మాత్రం కొన్ని చోట్ల సింపుల్‌గా చాలా స్లోగా సాగుతుందట. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్‌గా లేదు కథ సిల్లీగా సాగుతుందని అదే ఆ సినిమాకు మైనస్ అని సినీ ప్రేక్షకులు రివ్యూ ఇస్తున్నారు.
Also Read..
ఈరోజే రిలీజ్.. అప్పుడే ఓటీటీలోకి ‘Rangabali’.. స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే!