నాగార్జున కూతురు పేరు నిఖిత అంటూ వైరల్..? బయటపడ్డ అసలు నిజం
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున మొదట వెంకటేష్ చెల్లిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున మొదట వెంకటేష్ చెల్లిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ నాగచైతన్య పుట్టాడు. అయితే కొద్ది కాలం పాటు వీరి కాపురం బాగానే సాగినప్పటికీ.. విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత నాగార్జున నటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అఖిల్ జన్మించాడు. ప్రస్తుతం నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ అమల మాత్రం నటనకు దూరంగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా, నాగార్జున కూతురు పేరు నిఖిత అంటూ ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
అసలు విషయంలోకి వెళితే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున తనకు కూతురు పుడితే నిఖిత అనే పేరు పెట్టుకోవాలనుకున్నామని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘ అమల ప్రెగ్రెంట్‌గా ఉన్న సమయంలో యూఎస్ డాక్లర్లు స్కానింగ్ తీసి కూతురు పుడుతుందని చెప్పడంతో సంతోష పడ్డాను. దీంతో అమలను అక్కడే ఉంచి ట్రీట్‌మెంట్ ఇప్పించాను. కూతురు లేని లోటు తీరుతుందని జాగ్రత్తగా చూసుకున్నాను. ఇక అమ్మాయి పుడుతుందని తెలిసి అమల ఇండియాకు వచ్చే సమయంలో కూతురికి నిఖిత అనే పెట్టాలనుకుని టికెట్ కూడా బుక్ చేశాం.
కానీ రెండు రోజుల్లో డెలివరీ అవుతుందనగా.. అమల ఫోన్ చేసి నాకు బాబు పుడతాడని అనిపిస్తుంది. కలలో కూడా అలాగే కనిపించిందని చెప్పింది. దీంతో నేను షాక్ అయ్యాను. అదే నిజమవుతూ మాకు అమ్మాయి కాకుండా అబ్బాయి పుట్టాడు. అందుకే అఖిల్ అని పేరు పెట్టాం. కానీ నాకు కూతురు కావాలనే కోరిక ఉండేది. అమల అబ్బాయి అని చెప్పినప్పుడు కాస్త నిరాశ పడ్డాను. ఆ తర్వాత నార్మల్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చాడు నాగార్జున. ప్రస్తుతం ఈ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన అక్కినేని ఫ్యాన్స్ నాగార్జునకు కూతురు అంటే అంత ఇష్టమా అని అంటున్నారు.