చిరు అభిమానులకు నాగార్జున క్షమాపణలు..
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సహ నటుడు చిరంజీవి అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.
దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సహ నటుడు చిరంజీవి అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఆయన నటించిన 'ది ఘోస్ట్' అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా కర్నూల్లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు 'గాడ్ ఫాదర్' సినిమాను ఉద్దేశిస్తూ మాట్లాడిన హీరో.. 'మీ అందరికి తెలిసిందే. ఇండస్ట్రీలో నాకు సోదరుడు.. అత్యంత ఆప్త మిత్రుడు చిరంజీవి గారు. ఆయన సినిమా కూడా అక్టోబర్ 5వ తేదీనా విడుదల కాబోతోంది. కాబట్టి ఆయన చిత్రానికి అడ్డు రావడం నాకు ఇష్టం లేదు. కానీ, టీం మొత్తం తీసుకున్న నిర్ణయం కాబట్టి చిరంజీవి గారి సినిమాతో పోటి పడక తప్పడం లేదు. అందుకు మీరంతా నన్ను క్షమించాలి. మా రెండు సినిమాలు ఘన విజయం సాధిస్తాయనే నమ్మకం ఉంది. తెలుగు సినిమా వర్థిల్లాలి. 'గాడ్ ఫాదర్' టీమ్‌కు ఆల్ ది బెస్ట్' అంటూ చెప్పుకొచ్చాడు.