మెగా ఫ్యామిలీ పెళ్లి ముచ్చట.. ఈరోజే వరుణ్, లావణ్యల పెళ్లి తేదీ ప్రకటించనున్న నాగబాబు?
టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ పెళ్లి చేసుకోనున్న విషయం తెలసిందే. త్వరలో వీరు మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ నిశ్చితార్థానికి సంబంధించిన ఓ
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ పెళ్లి చేసుకోనున్న విషయం తెలసిందే. త్వరలో వీరు మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ నిశ్చితార్థానికి సంబంధించిన ఓ ఇన్విటేషన్ కార్డు తెగ వైరల్ అవుతోంది. ఇక దీనిపై మెగా ఫ్యామిలీ కానీ, లావణ్య త్రిపాఠీకానీ స్పందించలేదు. కొందరు వీరు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ముచ్చటిస్తే, మరికొందరు ఇది ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు.
కాగా, నెట్టింట మరో వార్త వైరల్ అవుతోంది. అయితే ఈరోజు నిశ్చితార్థం జరగబోతున్న నేపథ్యంలో పెళ్లి తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం రోజే బంధువులందరి మధ్యలో నాగబాబు, లావణ్య త్రిపాఠీ, వరుణ్‌ల పెళ్లి తేదీని ప్రకటించనున్నారని సమాచారం. ఇకపోతే వీరి వివాహ వేదికను కూడా ముందుగానే అనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిహారిక, చైతన్య ల వివాహం జరిగిన రాజస్థాన్‌లోని ఉదయ్ ఘడ్ లో వీరి వివాహం జరగబోతుందని సమాచారం.
Also Read: వరుణ్, లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ చిగురించడానికి కారణం ఎవరో తెలుసా?
బంగారు పూతతో వరుణ్, లావణ్యల పెళ్లి కార్డు.. ఖర్చు చూస్తే షాక్ అవ్వాల్సిందే?