భార్య పద్మజపై భావోద్వేగ పోస్ట్ పెట్టిన నాగబాబు.. ఏమన్నారంటే?

టాలీవుడ్ నటుడు మెగా బ్రదర్ నాగబాబు ఒకప్పుడు జబర్దస్త్ షోలో జడ్జ్‌గా వ్యవహరించేవారు. ప్రస్తుతం నటనకు దూరమై జనసేన పార్టీలో చేరారు.

Update: 2023-09-13 06:50 GMT
భార్య పద్మజపై భావోద్వేగ పోస్ట్ పెట్టిన నాగబాబు.. ఏమన్నారంటే?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటుడు మెగా బ్రదర్ నాగబాబు ఒకప్పుడు జబర్దస్త్ షోలో జడ్జ్‌గా వ్యవహరించేవారు. ప్రస్తుతం నటనకు దూరమై జనసేన పార్టీలో చేరారు. అయితే నాగబాబు ఫ్యామిలీతో కలిసి ఇటీవల ఇతర దేశాలకు వెకేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేస్తున్నారు.

తాజాగా, నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో భార్య పద్మజపై భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ‘‘నా ప్రియమైన పద్మకు, మీరు చేసిన అన్నిటికీ నా కృతజ్ఞతలు. మీరు నన్ను ఆదరించిన, నా పట్ల శ్రద్ధ వహించి, మా పిల్లలను పోషించిన తీరు లెక్కకు మించినది. మీ అచంచలమైన అంకితభావంతో మా కుటుంబం యొక్క గౌరవం, గర్వం నిలబెట్టింది. మీ పట్ల నా ప్రశంసలకు హద్దులు లేవని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ క్షణం నుండి, నేను నిన్ను పూర్తిగా ఆదరిస్తానని మీపై శ్రద్ధ వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీ పట్ల నా ప్రేమ శాశ్వతమైనది అది ఎప్పటికీ అలాగే ఉంటుంది’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Tags:    

Similar News