రోడ్డు పై జరిగిన గొడవ.. అసలు విషయం చెప్పిన నాగ శౌర్య

సెలబ్రిటీలు ఎవరు బయట కనిపించరు.

Update: 2023-06-28 05:51 GMT

దిశ, వెబ్ డెస్క్ : సెలబ్రిటీలు ఎవరు బయట కనిపించరు. బయట  కనిపించినా కూడా  ఎవరితోనూ మాట్లాడకుండా, వచ్చిన పని చూసుకుని వెళ్లిపోతారు. కానీ హీరో నాగశౌర్య మాత్రం ఈ మధ్య కాలంలో హైదరాబాద్లోని రోడ్డు పై ఓ అమ్మాయి, అబ్బాయి గొడవ పడుతుంటే మధ్యలోకి వెళ్లి..   వాళ్లకు ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు సందర్భం రావడంతో అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పాడు.

'నేను పనిమీద కూకట్‌పల్లి నుంచి వెళ్తున్నాను. ఆ సమయంలో ఓ అబ్బాయి తన లవర్ ని కొట్టడం చూశాను. వెంటనే కారు ఆపి అతడి దగ్గరికి వెళ్లి అడిగాను.. ఆమెకు సారీ చెప్పమని అడిగాను. అతను మాట్లాడే లోపు ఆ అమ్మాయి 'నా భాయ్ ఫ్రెండ్ నన్ను కొడతాడు, చంపుతాడు మీకేంటి?' అని నాకు రివర్స్ కౌంటర్ వేసింది. ఇక్కడ వచ్చిన ఇంకో రూమర్ ఏంటంటే.. ప్రచారం కోసం ఆ గొడవని నేనే ప్లాన్ చేశానని నా మీద ఎన్నో వార్తలు రాశారంటూ '  నాగశౌర్య చెప్పుకొచ‍్చాడు.

Also Read: పతనం వైపు అక్కినేని హీరోలు.. అలా చేయకపోతే రిస్క్‌లో పడ్డట్లేనా?

Tags:    

Similar News