మళ్లీ అడ్డంగా బుక్ అయిన Naga Chaitanya-Sobhita!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య-శోభితా రిలేషన్లో ఉన్నట్లు గతంలో పలు మార్లు వార్తలు వినిపించాయి.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య-శోభితా రిలేషన్లో ఉన్నట్లు గతంలో పలు మార్లు వార్తలు వినిపించాయి. కానీ వీరి మధ్య నిజంగానే ఎఫైర్ ఉందా? లేదా? అనేది జనాల్లో ఇప్పటికీ కన్ఫ్యూజ్ గానే ఉంది. అప్పట్లో చై-శోభితా ఓ రెస్టారెంట్లో కలిసి కనిపించిన ఫొటో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రస్తుతం వీరిద్దరి గురించి మరో వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం చైతన్య గ్రీన్ లైట్స్ అనే పుస్తకం గురించి చెబుతూ.. “జీవితానికి ఒక ప్రేమ లేఖ .. మీ ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు మాథ్యూ మాక్కనౌగే చాలా థాంక్యూ. ఈ కథ నాకు గ్రీన్ లైట్‌ను నింపింది.. రెస్పెక్ట్ సర్” అని చెప్పుకొచ్చారు.
ఇదే పుస్తకాన్ని తాజాగా శోభితా షేర్ చేస్తూ..“గత కొన్ని నెలల్లో నేను చదివిన అత్యుత్తమ పుస్తకం. ఎంత అపురూపమైన జీవిత కథ అంటే.. విపరీతమైన నవ్వును, స్వాతంత్య్రాన్ని సంపాదించిన రుచిలా ఉంది” అంటూ తెలిపింది. ఈ హీరోయిన్ చేతిలో పుస్తకం పట్టుకుని దిగిన పిక్ చూసి నెటిజన్లు.. ‘‘చైతన్య ఈ బుక్ చదవమని ఆమెను సజిస్ట్ చేశాడా?.. లేక బుక్ గిఫ్ట్ ఇచ్చాడా..?అని కొంతమంది, వీరిద్దరి మధ్య నిజంగానే రిలేషన్ ఉంది అనే తరహాలో మరికొంతమంది చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది.