ఆ రూమర్స్‌పై స్పందించిన నాగచైతన్య.. ఏమన్నాడంటే?

టాలీవుబ్ క్యూట్ కపుల్ సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ విడాకులు తీసుకుని విడిపోయారు.

Update: 2023-08-29 04:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుబ్ క్యూట్ కపుల్ సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ వాల్లు చూసుకుంటూ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే సమంత, విజయ్ దేవరకొండ నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. మరోవైపు నాగచైతన్య కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా ఉన్నాడు. సమంత, నాగచైతన్య గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త నెట్టింట వైరల్‌గా మారుతూనే ఉంటుంది.

అయితే నాగచైతన్య.. కొత్తగా వచ్చిన సినిమాలను హైదరాబాద్‌లో అప్పుడప్పుడు థియేటర్‌కి వెళ్లి చూస్తుంటాడట. అలా ఈ మధ్య కూడా వెళ్లి ఓ సినిమా చూస్తుండగా బ్రేక్ టైమ్‌లో సమంత ‘ఖుషి’ ట్రైలర్‌ను ప్లే చేశారట. అప్పుడు నాగచైతన్య దాన్ని చూడలేక వెంటనే బయటకు వెళ్లిపోయాడని ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చై ఈ రూమర్స్‌పై స్పందించాడు. ‘‘అవన్నీ చెత్త వార్తలు. వాటిలో ఏ మాత్రం నిజం లేదు. కొన్ని తెలుగు వెబ్‌సైట్స్‌లో వచ్చిన రూమర్స్ నా దృష్టికి వచ్చాయి. ఆ వార్తల్ని సరి చేయవలసిందిగా ఇప్పటికే వాళ్లకు సూచించాను. మేమిద్దరం ఇప్పటికే అఫీషియల్ గా డివోర్స్ తీసుకున్నాం. అయినప్పటికీ నాకు సమంత ఎప్పటికీ ప్రియమైన వ్యక్తే. నేను సమంత ఎవరి జీవితాల్లో వాళ్ళం చాలా హ్యాపీగా ఉన్నాం. సమంత లైఫ్ లాంగ్ తన జీవితంలో హ్యాపీగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News