టైం ట్రావెల్‌కి రెడీ అయిన నాగచైతన్య.. ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్..?

Update: 2022-01-31 03:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. సరికొత్త కథలను ఎంచుకుంటూ అభిమానులకు అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. తాజాగా చైతన్య నెక్స్ట్ మూవీపై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. చైతన్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం తాజాగా భారీ హిట్ అందుకున్న రాహుల్ సాంకృత్యన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. టైం ట్రావెల్ కథతో చైను రాహుల్ కలిశాడట. కథ నచ్చడంతో చై వెంటనే ఓకే చెప్పేశాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. 'శ్యామ్ సింగరాయ్'తో అందరినీ మెప్పించిన రాహుల్ తాజాగా థ్రిల్లర్ డ్రామాతో అందరినీ అలరించేందుకు సిద్ధమవుతున్నాడట.

రాహుల్ తన తర్వాతి సినిమా కోసం ఇంట్రెస్టింగ్ స్టోరీ రెడీ చేశాడని, ఆ సినిమా టైం ట్రావెల్‌ నేపథ్యంలో జరిగే థ్రిల్లర్ అని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాహుల్ ఈ సినిమా కథ ఫైనల్ డ్రిఫ్ట్‌ను రెడీ చేస్తున్నాడట. అది పూర్తయిన వెంటనే మరోసారి చైకి కథ వినిపించనున్నాడని, చైతన్య మరోసారి పచ్చజెండా ఊపితే సినిమాను పట్టాలెక్కిస్తాడని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుందనీ టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News