విజయ్ దేవరకొండ ముందు రష్మికతో ఆ పనిచేసి రివేంజ్ తీర్చుకోబోతున్న నాగచైతన్య!
సమంత, నాగచైతన్య విడిపోయినప్పటికీ వారిపై రూమర్స్ మాత్రం ఆగట్లేదు.
దిశ, సినిమా: సమంత, నాగచైతన్య విడిపోయినప్పటికీ వారిపై రూమర్స్ మాత్రం ఆగట్లేదు. ఒక్కటిపోతే మరొకటి పుట్టుకొస్తున్నాయి. అయితే తాజాగా విడుదలైన ‘ఖుషి’ సినిమాలో విజయ్ దేవరకొండ సమంత మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఇది చూసిన నాగచైతన్య ఎంతలా ఇబ్బంది పడి ఉంటాడో మనం ఊహించగలం. అయితే తాజాగా తన మాజీ భార్య సమంతతో విజయ్ దేవరకొండ రొమాన్స్ చేశాడనే కోపం పెంచుకున్న నాగచైతన్య ఆ హీరోపై ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేశాడంటూ ఫిలింనగర్ లో ఒక రూమర్ వినిపిస్తోంది. ఏమిటంటే చైతన్య నెక్స్ట్ మూవీలో హీరోయిన్గా రష్మిక మందన్నను తీసుకోవాలని, అంతేకాకుండా రష్మికతో ఘాటు రొమాన్స్ ఉండాలని డైరెక్టర్‌తోనూ చైతూ చెప్పాడట. దీంతో ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్స్ విజయ్ దేవరకొండపై రివేంజ్ ప్లాన్ మామూలుగా లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read More: నేను అలా చేశానని మీకు ఎవరు చెప్పారు? ఆ రూమర్‌పై రష్మిక ఫైర్