Samantha & Naga chaitanya మళ్లీ ఒక్కటవుతున్నారు..
నాగచైతన్య, సమంత ఓ టైం లో టాలీవుడ్ బెస్ట్ కపుల్... కానీ ఈ జంట అనుకోకుండా విడాకులు తీసుకుని ఫ్యాన్స్ కి కోలుకోలేని షాక్ ఇచ్చారు.
దిశ,సినిమా: నాగచైతన్య, సమంత ఓ టైం లో టాలీవుడ్ బెస్ట్ కపుల్... కానీ ఈ జంట అనుకోకుండా విడాకులు తీసుకుని ఫ్యాన్స్ కి కోలుకోలేని షాక్ ఇచ్చారు. కానీ ఈ జంట విడిపోయిన వార్త తెలిసిన దగ్గర నుంచి వారి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇక రీసెంట్ గా సమంత మయోసైటిస్ (myositis disease)అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తనకు ఎంత దూరంగా ఉంటే మాత్రం వారి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ఏం పోదు కదా..! ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. చాలా కాలం కలసి ట్రావెల్ చేశారు. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు కూడా. విడిపోతే మాత్రం.. ఏదైనా సమస్య వస్తే.. ఒకరికి మరొకరు తోడు నిలవకుండా ఉంటారా అలా ఆలోచించి సామ్ ని మంచి మనసుతో పలకరించాడు చైతు. ఇక అసలు విషయం ఏంటంటే సమంత.. నాగ చైతన్య ఒక ప్రాజెక్టు కోసం జతకట్టబోతున్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు విడిచిపెట్టి, వృత్తిపరంగా కలిసి పనిచేయడానికి సిద్ధం అయినట్లు వినిపిస్తుంది.. అదే కనుక జరిగితే ఈ జంటను తెరపై చూసేందుకు అభిమానులు థియేటర్ లకు క్యూ కడతారు.. ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి మరి.
Read more:
1.సమంతకు ఫోన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ! ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాలిసిందే !