Thandel : శివపార్వతులుగా నాగచైతన్య, సాయి పల్లవి.. వైరల్ అవుతున్న ఫోటోలు

శివపార్వతులుగా నాగచైతన్య, సాయి పల్లవి.

Update: 2024-09-30 06:19 GMT

దిశ , వెబ్ డెస్క్ : నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వచ్చిన 'లవ్ స్టోరీ' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. తాజాగా, ఈ హిట్ జోడి తండేల్ సినిమాతో మరోసారి మనల్ని అలరించడానికి రెడీ అవుతున్నారు. గీత ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మాణంలో చందూ మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. యదార్ధ ఘటన ఆధారంగా కథను రాసుకున్నారని దర్శక నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

తండేల్ నుంచి విడుదలైన గ్లింప్స్ మూవీపై అంచనాలను భారీగానే పెంచేసింది. ప్రస్తుతం, ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. శ్రీకాకుళం దగ్గర్లోని శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఆ వేడుకల సీన్ మూవీలో ఉండటంతో శివరాత్రి కోసం స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.

దాదాపు 1000 మంది ఆర్టిస్టులు, డ్యాన్సర్లతో కలిపి ఈ పాట షూట్ చేస్తున్నారు. తాజాగా, చిత్ర బృందం ఫ్యాన్స్ కోసం కొన్ని ఫోటోలు విడుదల చేసింది. ఈ ఫొటోల్లో నాగచైతన్య, సాయి పల్లవిలను చూస్తుంటే సాక్షాత్తు శివపార్వతులు కిందకొచ్చి నాట్యం చేస్తున్నట్టు ఉందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News