NTR: మా అమ్మ కల నిజమైంది.. ఆమెకు నేనిచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇదేనంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రజెంట్ కొరటాల శివ డైరెక్షన్లో ‘దేవర’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రజెంట్ కొరటాల శివ డైరెక్షన్లో ‘దేవర’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల తారక్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది. సెప్టెంబర్ 27న దేవర మూవీ థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కూడా ఓ మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో పాటు తన తల్లిని తీసుకుని ఉడిపికి వెళ్లాడు. అక్కడి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తల్లితో కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘ మా అమ్మ ఎప్పుడూ తన సొంతూరు కుందాపురాతో పాటు ఉడుపి శ్రీకృష్ణుని దర్శనం చేయించాలని కలలు కంటూ ఉంటుంది.
ఇప్పుడు ఆ కల నిజమైంది. సెప్టెంబర్ 2న ఆమె పుట్టినరోజు కావడంతో నేను ముందుగానే ఆమెకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇదే.విజయ్ కిరంగదూర్ మీకు ధన్యవాదాలు. నా ప్రియమిత్రుడు ప్రశాంత్ నీల్‌తో పాటు కలిసి రావడం సంతోషంగా ఉంది. అలాగే రిషబ్ శెట్టి కూడా అందులో భాగం అయి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా చేశాడు’’ అని రాసుకొచ్చాడు. ప్రజెంట్ ఎన్టీఆర్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.