నా మాజీ భర్త వేలం వేసి తన స్నేహితులతో ఒక రాత్రి పడుకోవాలన్నాడు.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్!
ఒకప్పటి హీరోయిన్ కరిష్మా కపూర్ మోడల్‌గా పరిచయం అయినప్పటికీ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొద్ది కాలం పాటు రాణించింది. పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.
దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ కరిష్మా కపూర్ మోడల్‌గా పరిచయం అయినప్పటికీ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొద్ది కాలం పాటు రాణించింది. పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ కెరీర్ పీక్స్‌లో ఉండగానే సంజయ్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి కూడా పూర్తిగా దూరమైంది. 2016లో భర్తతో విడాకులు తీసుకుని విడిపోయింది.
ఆ తర్వాత మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాజాగా, కరిష్మా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరిష్మా తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వడానికి గల కారణాలేంటో రివీల్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘ నన్ను నా భర్త అప్పట్లో తన స్నేహితుల దగ్గర వేలం వేశారు. ఎవరైతే ఎక్కువ డబ్బులు చెల్లిస్తారో వాళ్లతో నేను ఒక రాత్రి గడపాలని చెప్పాడు. ఇలాంటి నీచమైన చర్యలు చేసి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాడు. వాటిని భరించలేకపోయిన నేను అందుకే అతనికి విడాకులు ఇచ్చి విడిపోయాను’’ అంటూ చెప్పుకొచ్చింది.