Mrunal Thakur: ప్రేమలో పడ్డ యంగ్ బ్యూటీ.. ఎట్టకేలకు లవ్ సింబల్‌తో ఫైనల్ చేసేసిందిగా (ట్వీట్)

‘సీతారామం’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మనందరికీ సుపరిచితమే.

Update: 2024-08-17 02:27 GMT

దిశ, సినిమా: ‘సీతారామం’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మనందరికీ సుపరిచితమే. ఈ సినిమాలో తన, అందం అభినయంతో ఆకట్టుకుంది. దానికి తగ్గట్టుగానే తన నటనతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దీ ఫ్యామిలీ స్టార్, హాయ్ నాన్న వంటి మూవీస్‌లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మరో ప్రాజెక్టును ప్రకటించలేదు. కానీ, నిత్యం సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటో షూట్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది.

ఇదిలా ఉంటే.. బేసిక్‌గా హీరో, హీరోయిన్స్ అన్నాక రూమర్స్ రావడం కామన్. సపోజ్ ఒక హీరో నచ్చాడు.. లేదా అతనిలో ఆ క్వాలిటీ నచ్చుతుంది అని చెప్పడమే ఆలస్యం వారిద్దరి మధ్య ఏదో ఉందని రూమర్ క్రియేట్ చేసేస్తారు. ఈ నేపథ్యంలో మృణాల్ ఓ తెలుగు హీరోతో డేటింగ్‌లో ఉందని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఓ పుకారు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా మృణాల్.. మరోసారి ప్రేమలో ఉంది అనే వార్తలు జోరందుకున్నాయి. అయితే ఈ అమ్మడు.. తాజాగా తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో లవ్ సింబల్‌ని షేర్ చేసింది. ఇక ఎప్పుడూ లేనిది ఎలాంటి క్యాప్షన్ పెట్టకుండా అలా లవ్ సింబల్ పెట్టడంతో మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిపోయిందని, అందుకే పరోక్షంగా ఇలా లవ్ సింబల్ పెట్టి హింట్ ఇచ్చేస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఆమె తన X ఖాతాలో పెట్టిన లవ్ సింబల్ నెట్టింట వైరల్‌గా మారడంతో ఇంతకీ మృణాల్ ఠాకూర్ ఎవరి ప్రేమలో పడింది.. హీరోను ప్రేమిస్తుందా లేక ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తితో ప్రేమలో పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి తాను పెట్టిన లవ్ సింబల్ పై మృణాల్ ఠాకూర్ క్లారిటీ ఇస్తుందా లేదా అనేది చూడాలి మరి.

Click Here for Twitter Link

Tags:    

Similar News