ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు.. ఆశ్చర్యమేస్తుందన్న మృణాల్

రీసెంట్‌ ఇంటర్వ్యూలో కెరీర్ అండ్ పర్సనల్ విషయాల గురించి ఓపెన్ అయింది.

Update: 2023-09-20 07:35 GMT

దిశ, సినిమా: లైఫ్‌లో ఏదీ ప్లాన్ చేసుకోకుండానే జరిగిపోవడం ఆశ్చర్యంగా ఉందంటోంది నటి మృణాల్ ఠాకూర్. ప్రజంట్ టాలీవుడ్‌లో వరుస మూవీస్ చేస్తున్న ఆమె రీసెంట్‌ ఇంటర్వ్యూలో కెరీర్ అండ్ పర్సనల్ విషయాల గురించి ఓపెన్ అయింది. ‘కెరీర్‌ గురించి నేను పెద్దగా ప్రణాళికలు వేసుకోలేదు. మనసుకు నచ్చిన స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకుసాగుతున్నా. ఒక నటిగా ప్రతీ మూవీకి మరింత మెచ్యూరిటీ పెంచుకోవడమే టార్గెట్‌గా పెట్టుకున్న. ఒక్కోసారి ఆలోచిస్తే నా సినీ జర్నీ నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. మరాఠీ చిత్రాల్లో రాణిస్తే చాలనుకునే స్థాయి నుంచి ఇప్పుడు పాన్‌ ఇండియా రేంజ్‌లో ఛాన్స్ దక్కించుకోవడం లక్కీగా భావిస్తున్నా. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వందశాతం క్యారెక్టర్‌కు న్యాయం చేయడంపైనే ఫోకస్ పెడుతున్నా’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News