అమ్మ సెంటిమెంట్‌తో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలివే!

ప్రతీ ఇండస్ట్రీలోనూ వేరు వేరు రకాల సినిమాలు వస్తుంటాయి. కొన్ని కమర్షియల్ అయితే, కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఎక్స్పెరిమెంటల్‌గా ఉంటాయి.

Update: 2023-09-25 04:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ ఇండస్ట్రీలోనూ వేరు వేరు రకాల సినిమాలు వస్తుంటాయి. కొన్ని కమర్షియల్ అయితే, కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఎక్స్పెరిమెంటల్‌గా ఉంటాయి. ఏ ఇండస్ట్రీలో అయినా ఎక్కువగా లవ్ సినిమాలు వచ్చి యూత్‌ను ఆకర్షిస్తున్నాయి. కొన్ని సినిమాల్లో అయితే కథ మొత్తం ఒక పాత్ర చుట్టూ తిరుగుతుంది. అలా మన ఇండస్ట్రీలో మదర్ సెంటిమెంట్ సినిమాలు ఎన్నో ఉన్నప్పటికీ ముఖ్యంగా కొన్ని థియేటర్స్‌లో విడుదలై బాక్సాఫీసును షేక్ చేశాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

*ఛత్రపతి: కమర్షియల్ సినిమా అయినా కూడా మెయిన్ కాన్సెప్ట్ మాత్రం మదర్ సెంటిమెంట్ చుట్టూ నడుస్తుంది. 29 సెప్టెంబర్ 2005లో విడుదలైంది.

*బిచ్చగాడు: ఈ సినిమా డబ్బింగ్ అయినా కూడా మన తెలుగు ప్రేక్షకులను అలరించి హిట్ అయింది. 4 మార్చి 2016లో రిలీజ్ అయింది.

*బాహుబలి: ఈ సినిమా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కలెక్షన్స్ విషయంలోనూ రికార్డు సృష్టించింది. అలాగే అమ్ సెంటిమెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2015 లో వచ్చిన మొదటి భాగము బాహుబలి.

*రఘువరన్ బీటెక్: అసలు మదర్ సెంటిమెంట్ సినిమాలు అనగానే చాలా మందికి సినిమా స్ట్రైక్ అయ్యే ఉంటుంది. సినిమా వచ్చి కొన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ క్రేజ్ అలానే ఉంది. 18 జూలై 2014 విడుదలైంది.

* అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి: ఈ సినిమాలో జయసుధ గారికి, రవితేజ కి మధ్య వచ్చే సీన్స్ చాలా నాచురల్ గా పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. 19 ఏప్రిల్ 2003లో వచ్చింది.

Read More Latest Movie News

Tags:    

Similar News