Priyanka Chopra: ప్రియాంకను దారుణంగా అవమానించిన పాక్ నటుడు.. బాడీ కలర్‌‌పై వల్గర్ కామెంట్స్

గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా బాడీ కలర్‌ను ఉద్దేశిస్తూ పాకిస్థాన్ నటుడు మోమ్మర్ రాణా చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

Update: 2023-08-31 11:01 GMT

దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా బాడీ కలర్‌ను ఉద్దేశిస్తూ పాకిస్థాన్ నటుడు మోమ్మర్ రాణా చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో మోమ్మర్ వెంటనే ప్రియాంకకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున్న డిమాండ్ చేస్తున్నారు. విషయానికొస్తే.. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న ఆయనను ‘ఇండియాలో ఏ నటిని చూసి మీరు భయపడ్డారు?' అని విలేఖరి ప్రశ్నించగా.. 'ప్రియాకం అంటే నాకు చాలా అభిమానం.

ఆమె నటనకు ఫిదా అయ్యాను. ఆమె మీద మనసుపడ్డాను. అయితే ఓ ఈవెంట్‌లో నా పక్క సీట్‌లో చాలా సేపు కూర్చుని లేచిపోయింది. ఆ తర్వాత ఎవరని తెలుసుకున్నాను. అప్పుడు ఆమెను ఫస్ట్ టైమ్ డైరెక్టు చూసి భయపడ్డాను. అప్పటినుంచి ఆమెపై నాకున్న అభిమానం పోయింది’ అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పీసీ ఫ్యాన్స్ మోమ్మర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తమ నటిని దారుణంగా అవమానించాడని, వెంటనే సారీ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.


Similar News