MM Keeravani: తన ‘మొదటి ఆస్కార్’ రాంగోపాల్ వర్మే అంటున్న MM కీరవాణి !

‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ‘నాటు నాటు’ సాంగ్‌కు ఒరిజినల్ బెస్ట్ స్కోర్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే

Update: 2023-03-26 06:21 GMT

దిశ, సినిమా: ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ‘నాటు నాటు’ సాంగ్‌కు ఒరిజినల్ బెస్ట్ స్కోర్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు‌ను ఎంఎం కీరవాణి అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇది తనకు రెండవ ఆస్కార్ అని, తనకు వర్మ పేరుతో ముందుగానే ఒక ఆస్కార్ అవార్డు లభించిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ‘‘నేను అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఎవరూ గుర్తించలేదు. దాదాపు 51 మంది దర్శకుల దగ్గరకు తిరిగాను. సగం మంది అయితే నా ట్యూన్ కూడా వినకుండా క్యాసెట్లు చెత్తబుట్టలో పడేశారు. మరి కొందరు నీ ట్యూన్ బాగున్నా తీసుకోలేకపోతున్నామని చెప్పారు. అప్పుడే రామ్ గోపాల్ వర్మ రూపంలో నాకు ఒక ఆస్కార్ అవార్డు దొరికింది. ఆయన దగ్గరకు వెళ్లి నాకు ఒక అవకాశం ఇవ్వాలని అడిగాను. ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ‘క్షణం క్షణం’ అనే సినిమాకు ఆయన అవకాశం ఇచ్చారు. కనీసం ఒక్క టెస్ట్ కూడా పెట్టకుండా నమ్మకంతో చాన్స్ ఇచ్చారు. ఈ మూవీ‌తో నేనెంటో ప్రూఫ్ చేసుకున్నాను. ఇక ఆ తర్వాత చాలా మంది దర్శకులు నన్ను బుక్ చేసుకున్నారు’’ అంటూ చెప్పుకొచ్చారు కీరవాణి. ఇప్పటి విషయాలు పక్కన పెడితే, అప్పట్లో టాలెంట్‌ని గుర్తించడంలో మాత్రం వర్మ చాలా గొప్పవాడని తెలిపారు.

Tags:    

Similar News