గార్జియస్ లుక్స్‌తో అదరగొడుతున్న మిల్క్ బ్యూటీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్
మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది.
దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా బిజీ బిజీగా సినిమాలు చేస్తూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘అరుణ్మణై 4’ అనే తమిళ్ సినిమాలో నటించింది. ఈ మూవీ థియేటర్స్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే తెలుగులోనూ ‘బాక్’ టైటిల్‌తో వచ్చి ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది. ఒక్క సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఓటిటి లో విడుదలై మంచి పేరు సంపాదించిన 'ఓదెల రైల్వే స్టేషన్' అనే తెలుగు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న 'ఓదెల 2' మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ అమ్మడు. అదే విధంగా సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే హాట్ హాట్ స్టిల్స్‌తో ఉన్న ఫోటోలు షేర్ చేసి కుర్రకారుకి హీట్ పుట్టిస్తోంది.
తాజాగా తమన్నా ఇన్‌స్టా వేదికకా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో మత్తెక్కించే కళ్లతో మెస్మరైజ్ చేస్తూ ఫోటోలకి పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు గార్జియస్ బ్యూటీ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట సూపర్‌గా వైరల్ అవుతున్నాయి. మరి మీరు ఆ ఫోటోలపై ఓ లుక్ వేసేయండి.