నా తప్పు తెలుసుకున్నా.. మెగా అల్లుడు కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్..

మెగస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్‌ దేవ్ ఈ ఏడాది ఎక్కువగా హైలెట్ అయ్యాడు. తన సినిమాల సంగతి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్‌లోని సంఘటనలతోనే వైరల్ అయ్యాడు. కళ్యాణ్‌ దేవ్ తాజాగా కొత్త ఏడాదికి సంబంధించి విషెస్ అందించాడు.

Update: 2022-12-31 12:10 GMT

దిశ, సినిమా: మెగస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్‌ దేవ్ ఈ ఏడాది ఎక్కువగా హైలెట్ అయ్యాడు. తన సినిమాల సంగతి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్‌లోని సంఘటనలతోనే వైరల్ అయ్యాడు. కళ్యాణ్‌ దేవ్ తాజాగా కొత్త ఏడాదికి సంబంధించి విషెస్ అందించాడు. ''ఈ ఏడాది మాత్రం ఎంతో నేర్చుకున్నాను.. సహనంగా ఎలా ఉండాలో .. ఎదుగుదల అంటే ఏంటో తెలిసింది.. అవకాశాలను అందుకోవడం, రిస్క్ తీసుకోవడం తెలుసుకున్నా. నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. అవతలి వాళ్ళని క్షమించడం, నాతో నేను గడపడం నేర్చుకున్నాను.

నా ఈ ప్రయాణంలో ఉండి.. నన్ను నేను మార్చుకునేలా సాయపడిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. నా కష్టకాలంలో భుజాన్ని అందించిన వారికి థాంక్స్.. మనకు అంతా మంచే జరగాలని అనుకుంటాం కానీ కొన్ని సార్లు అది జరగకపోవచ్చు.. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ మనం చేసే ప్రయత్నాలను వదిలిపెట్టకూడదు.. మీ అందరికీ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని, సంతోషం, ఆరోగ్యం, విజయం అన్నీ చేకూరాలని కోరుకుంటున్నాను'' అని కళ్యాణ్‌ దేవ్ చెప్పుకొచ్చాడు.

Full View


Similar News