Sreeja Konidela : త్వరలో శుభవార్త చెబుతానంటూ మెగాస్టార్ చిన్న కూతురు కీలక ప్రకటన.. పోస్ట్ వైరల్

మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజకు సీని ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ ఉంది. ముఖ్యంగా ఆమె వైవాహిక జీవితం ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచింది.

Update: 2023-09-03 05:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజకు సీని ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ ఉంది. ముఖ్యంగా ఆమె వైవాహిక జీవితం ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల ఓ కూతురు పుట్టాక విడాకులు తీసుకుంది. దీంతో చిరంజీవి దగ్గరకు వచ్చి చేరింది. తర్వాత మెగాస్టార్ యంగ్ హీరో కల్యాణ్ దేవ్‌కు ఇచ్చి శ్రీజకు మరో పెళ్లి చేశారు. అయితే వీరిద్దరికి కూడా ఓ కూతురు పుట్టింది. అయితే ఇటీవల వీరిద్దరు మనస్పర్థల వల్ల విడిపోయారని పలు వార్తలు వచ్చాయి. కానీ, దానిపై ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేదు. శ్రీజ మాత్రం కల్యాణ్ దేవ్‌కు దూరంగా తన కూతుర్లతో కలిసి ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులు పెడుతుంది.

తాజాగా, శ్రీజ తన ఇన్‌స్టా స్టోరీలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘‘సంథింగ్ ఈస్ కమింగ్’’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ అందరిలో అనుమానాలను పుట్టిస్తోంది. కొత్తగా ఏదో గుడ్ న్యూస్ చెప్పబోతుందని అర్థమవుతుంది. అంతేకాదు ఈ పోస్టుల కింద స్వాతి నిమ్మగడ్డ అనే పేరును కూడా ట్యాగ్ చేసింది. మొత్తానికైతే శ్రీజ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.



Tags:    

Similar News