Pawan Kalyan: పవన్ కల్యాణ్‌‌పై విమర్శలు.. Megastar Chiranjeevi రియాక్షన్ ఇదే!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై మరోసారి మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-01-02 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై మరోసారి మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా పవన్ కల్యాణ్‌పై కొంతమంది వ్యక్తులు చేసే విమర్శలు వింటుంటే మనసుకు చాలా బాధగా ఉంటుందని ఎమోషనల్ అయ్యారు. పవన్‌ను విమర్శించిన వాళ్లే మళ్లీ నా దగ్గరకు వచ్చి పెళ్లిళ్లు, పేరంటాలకు రావాలని పిలుస్తుంటారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పవన్‌ను తిట్టే వారిని కలవాల్సి వస్తుందని బాధగా అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ తనకు బిడ్డలాంటి వాడని అభిప్రాయపడ్డారు. డబ్బు, పదవులపై ఎలాంటి వ్యామోహం అతనికి లేదు, ఉండదని వ్యాఖ్యానించారు. చిన్నప్పటినుంచి సామాజిక బాధ్యతలు మరువలేదని గుర్తుచేశారు. శత్రువులైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చలించిపోతాడని అన్నారు. ఎప్పటికైనా పవన్ అనుకున్న రోజు వస్తుందని భావిస్తున్నానని అన్నారు.

Also Read...

వాల్తేరు వీరయ్య సినిమా నుంచి త్వరలో ఐదో సింగిల్ 

Tags:    

Similar News