మెగాస్టార్ 'Waltair Veerayya' నుంచి క్రేజీ అప్‌డేట్..

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీ హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'.

Update: 2022-12-25 04:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీ హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్ర నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. తాజాగా, 'వాల్తేరు వీరయ్య' టైటిల్ పాటను రిలీజ్ చేస్తునట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 26న తేదీన విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా చిత్రబృందం షేర్ చేసింది.

ఓటీటీలోకి నయనతార 'Gold' మూవీ.. 

Tags:    

Similar News