Megastar Chiranjeevi: మరో ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి..!
టాలీవుడ్(Tollywood) సినిమా దిగ్గజం, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సెప్టెంబర్ 22న ప్రతిష్ఠాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(Guinness World Records)లో చోటు సంపాదించుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్:టాలీవుడ్(Tollywood) సినిమా దిగ్గజం, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సెప్టెంబర్ 22న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(Guinness World Records)లో చోటు సంపాదించుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.తన 46 ఏళ్ల సినీ ప్రయాణంలో 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్స్ తో ప్రేక్షకులను అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.ఈ అవార్డు దక్కించుకున్న మొదటి నటుడిగా ఆయన రికార్డ్ సొంతం చేసుకున్నాడు.దీంతో దేశవ్యాప్తంగా చిరంజీవిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా తాజాగా చిరంజీవి మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు.యూఏఈ(UAE)లోని అబుదాబి(Abu Dhabi)లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(IIFA) అవార్డ్స్ 2024 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి 'ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా' అవార్డును అందుకున్నారు.ఈ కార్యక్రమానికి సహచర హీరోలు బాలకృష్ణ(Balakrishna),విక్టరీ వెంకటేష్(Venkatesh) కూడా హాజరయ్యారు.అవార్డు అందుకున్న చిరంజీవిని అభినందించారు.ఈ సందర్భంగా బాలకృష్ణ, చిరంజీవిని హగ్ చేసుకున్నారు. దీనికి సంబధించిన వీడియో,ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.