సల్మాన్ ఖాన్‌తో ఎంట్రీ.. అదిరిపోయిన Mega Star Birthday గిఫ్ట్

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టాన్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు 'గాడ్ ఫాదర్' నుంచి అప్‌డేట్ ఇచ్చింది చిత్ర బృందం.

Update: 2022-08-22 05:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టాన్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు 'గాడ్ ఫాదర్' నుంచి అప్‌డేట్ ఇచ్చింది చిత్ర బృందం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మోహన్ రాజా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'గాడ్ ఫాదర్'. ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ''20 ఏళ్లు ఎక్కడకు వెళ్లాడో ఎవరికీ తెలియదు. సడన్‌గా తిరిగి వచ్చిన ఆరేళ్లలోనే చాలా మంది పాపులారిటీని సంపాదించుకున్నాడు'' అంటూ సాగిన ఈ టీజర్ సినిమాపై హైప్‌ను పెంచే విధంగా ఉంది. చిరంజీవి రాజకీయ నాయకుడిగా కనిపించిన ఈ టీజర్‌లో.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నయనతారా, సత్యదేవ్, సముద్రఖని, బ్రహ్మాజీ కూడా కనిపించారు. కాగా, ఈ సినిమా అక్టోబర్ 5న విడుదలకు సిద్ధమవుతుంది.


Tags:    

Similar News